Publish Date: Wed, 28 Oct 2015 (18:37 IST)
Updated Date: Wed, 28 Oct 2015 (18:38 IST)
సుధీర్ వర్మ-విజయవాడ: మీరు పంచమి శుక్రవారం, కర్కాటక లగ్నము, విశాఖ నక్షత్రం, తులా రాశి నందు జన్మించారు. 2017 వరకు ఏల్నాటి శనిదోషం అధికంగా ఉన్నందువల్ల నెలకు ఒక శనివారంనాడు 16సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి తెల్లని పూలతో శనిని పూజించి, అర్చించండి శుభం కలుగుతుంది. ఈ శని దోషం వల్ల వ్యాపారంలో నష్టం, కుటుంబీకుల మధ్య అవగాహనాలోపం, అందరికీ సహాయం చేసి మాటపడటం, అపనిందలు, అపవాదులను ఎదుర్కొంటారు.
2019 వరకూ ఉద్యోగం చేయండి. ఆ తదుపరి వ్యాపారంలో స్థిరపడవచ్చు. 2017 నుంచి బుధ మహర్దశ ప్రారంభమవుతుంది. ఈ బుధుడు 17 సంవత్సరములు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇస్తాడు. ప్రతిరోజు లక్ష్మీనారాయణుడిని ఆరాధించడం వల్ల ఆర్థికంగా పురోభివృద్ధి పొందుతారు. ఏదైనా విష్ణు దేవాలయాల్లో మొగలి చెట్టు నాటిని సర్వదా శుభం కలుగుతుంది.
గమనిక: మీ సందేహాలను [email protected] కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి.