Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్థిక, ఉద్యోగ, సంతాన లేమి సమస్యలు... పుత్రగణపతితో హోమశాంతి చేయించండి...

Advertiesment
ఆర్థిక, ఉద్యోగ, సంతాన లేమి సమస్యలు... పుత్రగణపతితో హోమశాంతి చేయించండి...
, బుధవారం, 16 సెప్టెంబరు 2015 (20:42 IST)
వెంకట సత్య సుబ్రహ్మణ్యం గారూ... మీరు ఏకాదశి, శుక్రవారం, వృశ్చికలగ్నం, శ్రవణానక్షత్రం, మకర రాశి నందు జన్మించారు. రాజ్య లేక ఉద్యోగాధిపతి అయిన రవి నీచ బుధునితో కలిసి పంచమము నందు ఉన్నందువల్ల, అష్టమ స్థానము నందు కుజుడు ఉన్నందువల్ల, ధనాధిపతి అయిన బృహస్పతిని కేతువు పట్టడం వల్ల, శేషనాగ సర్పదోషం ఏర్పడింది. ఈ దోషాలకు శాంతి చేయించిన మీకు శుభం కలుగుతుంది. 2005 నుంచి గురు మహర్దశ ప్రారంభమైంది. ఈ గురువు 2017 నుంచి 2021 వరకూ యోగాన్ని తదుపరి శని మహర్దశ 19 సంవత్సరాలు మంచి యోగాన్ని ఇవ్వగలదు. 
 
కుటుంబాధిపతి ధనాధిపతి అయిన బృహస్పతి దోషం ఉన్నందువల్ల భార్యాభర్తల మధ్య అవగాహన లోపం, అశాంతి, చికాకు, ఆందోళన వంటివి ఎదుర్కొంటున్నారు. 2016 ఏప్రిల్ తదుపరి మీ సమస్యలు పరిష్కరించబడుతాయి. 2017 నుండి పురోభివృద్ధి కానరాగలదు. మీరు బాగుగా స్థిరపడతారు. అప్పుడప్పుడు వ్యాపారాల పట్ల ఆసక్తి అధికమైనా మీ భార్యతో వ్యాపారాలు చేసినట్లయితే కలిసి రాగలదు. 
 
సంతాన యోగం 45 శాతం మాత్రమే ఉన్నందువల్ల సంతాన దోషం ఏర్పడింది. ఈ దోషానికి పుత్రగణపతి, సంతానవేణుగోపాల స్వామికి, 108 రకాల మూలికలతో హోమశాంతి చేయించన సర్వదా శుభం కలుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu