మీరు చవితి ఆదివారం, తులాలగ్నము, విశాఖ నక్షత్రం తులారాశి నందు జన్మించారు. 2017 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీరోజూ ఈ క్రింది శ్లోకాన్ని 19 సార్లు పఠించినా ఆటంకాలు తొలగిపోగలవు.
" ఓం రవిసుతాయ విద్యహే మందగ్రహాయ ధీమహి తన్నః శనిః ప్రచోదయాత్ ||" 2006 నుంచి శుక్ర మహర్ధశ ప్రారంభమైంది. ఈ శుక్రుడు 20 సంవత్సరములు 2013 నుంచి మంచి యోగాన్ని అభివృద్ధిని ఇస్తుంది. 2026 వరకు సత్ఫలితాలను పొందుతారు.
మీ పెద్ద కుమార్తె తదియ గురువారం, మీనలగ్నము, ఉత్తరా నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు ఏలినాటి శనిదోషం ఉండటం వల్ల ప్రతీ శనివారం, 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని మందారపూలతో శనిని పూజించడం వల్ల శుభం కలుగుతుంది. మీ 24లేక 25వ సంవత్సరము నందు బాగా స్థిరపడతారు. 2007 నుంచి రాహు మహర్ధశ ప్రారంభమైంది.
ఈ రాహువు 2015 నుంచి 2025 వరకు మంచి యోగాన్ని ఇవ్వగలదు. జ్ఞానసరస్వతిని ఆరాధించడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది. మీ రెండో కుమార్తె ద్వాదశి ఆదివారం, వృషభలగ్నము, అశ్వని నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. లగ్నము నందు కేతువు ఉండి, సప్తమ స్థానము నందు రవి, బుధ, రాహువులు ఉండటం వల్ల, మీరు టెక్నికల్ రంగాల పట్ల ఏకాగ్రత వహించినా అభివృద్ధి పొందుతారు.
మీ 24 లేక 25 సంవత్సరము నందు స్థిరపడతారు. 2015 వరకు సామాన్యంగా ఉన్నా అక్కడ నుంచి రవి మహర్ధశ ఆరు సంవత్సరములు చంద్రుడు పది సంవత్సరములు కుజుడు ఏడు సంవత్సరములు మంచి యోగాన్ని ఇస్తాడు. జ్ఞానప్రసూనాంబను పూజించడం వల్ల సర్వం శుభం కలుగుతుంది.