2013 లేక 2014న మీకు వివాహం అవుతుంది
, గురువారం, 15 నవంబరు 2012 (17:26 IST)
మీరు నవమి ఆదివారం, మీనలగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. లగ్నము నందు గురు, చంద్ర, రాహువులు ఉండటం వల్ల, కళత్ర స్థానము నందు కేతువు ఉండటం వల్ల, అనంతనాగ సర్పదోషం ఏర్పడింది. ఈ దోషానికి శాంతి చేయించినా సర్వదా శుభం కలుగుతుంది. ఈ దోషం వల్ల వివాహ విషయంలో ఊహించని సమస్యలు తలెత్తగలవు. జాగ్రత్త వహించండి. 2014 వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 16 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి తెల్ల శంఖుపూలతో శనిని పూజించినా మీకు శుభం కలుగుతుంది. 2013 లేక 2014 నందు మీకు వివాహం కాగలదు.