2013 లేదా 2014లో మీకు గ్రీన్ కార్డ్ వస్తుంది
, మంగళవారం, 25 సెప్టెంబరు 2012 (21:33 IST)
సంధ్యారాణి - యు.ఎస్.ఎ : మీరు పంచమి శనివారం, కర్కాటక లగ్నము, చిత్తా నక్షత్రం, తూలారాశి నందు జన్మించారు. 2017 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ఓర్పు, నేర్పు, సహనం చాలా అవసరం అని గమనించండి. నెలకు ఒక శనివారంనాడు 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని గులాబీలతో శనిని పూజించినా శుభం కలుగగలదు. 2013 లేక 2014 నందు సంతాన యోగం ఉంది. ఇదే సమయంలో మీ గృహం పూర్తవుతుంది. గ్రీన్ కార్డు పుచ్చుకుంటారు. 2014 నుంచి శని మహర్దశ 19 సంవత్సరముల మంచి యోగాన్ని అభివృద్ధినివ్వగలదు. 2025 వరకు విదేశాలలో ఉండే అవకాశం ఉంది. ప్రతీరోజు అంబకాష్టకం చదివినా లేక విన్నా సర్వదా శుభం కలుగుతుంది. అమ్మవారిని గన్నేరు పూలతో పూజించండి. 2013 నందు ఉద్యోగంలో స్థిరపడతారు. మీ భర్త పి. నరేంద్రనాధ్ పాడ్యమి ఆదివారం, మిథున లగ్నము, స్వాతి నక్షత్రం తులారాశి నందు జన్మించాడు. మీది మీ భర్తది ఏకరాశి అవ్వడం వల్ల ఏకరాశి దోషం ఏర్పడింది. 2017 వరకు ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 18 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి జాజిపూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి. 2008 నుంచి శని మహర్థశ ప్రారంభమయింది. ఈ శని 2027 వరకు మంచి యోగాన్ని ఇస్తుంది. ఈశ్వరుని ఆరాధించడం వల్ల ఐశ్వరాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి చేకూరుతుంది. అన్ష్ చిన్మయ్ ద్వాదశి శనివారం, వృషభ లగ్నము, శతభిష నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. లగ్నము నందు శుక్రుడు ఉండటం వల్ల వైద్య కళా రంగాలలో బాగుగా రాణిస్తారు. ఈమె 10 సంవత్సరములో ఆరోగ్యములో చిన్న చిన్న సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపొగలవు. ముదురు రంగు దుస్తులు ఎల్లవేళలా శుభం. జ్ఞాన సరస్వతిని చామంతి పూలతో పూజించడం వల్ల విద్యాభివృద్ధి, పురోభివృద్ధ చేకూరుతుంది. ఈమెకు ఒక సోదరుడు ఉండే అవకాశం ఉంది.