మీరు షష్టి ఆదివారం, వృశ్చికలగ్నము, ఉత్తరాషాఢ నక్షత్రం మకరరాశి నందు జన్మించారు. లగ్నము నందు రవి, బుధ, శనులు ఉండటం వల్ల మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. భార్యస్థానాధిపతి అయిన శుక్రుడు వ్యయము నందు ఉండటం వల్ల, కేతువులో కలయిక వల్ల వివాహ విషయంలో జాతక పొంతన జాగ్రత్త అవసరం.
2006 నుంచి రాహు మహర్ధశ ప్రారంభమైంది. ఈ రాహువు 2012 అక్టోబర్ నుంచి మంచి యోగాన్ని అభివృద్ధినిస్తాడు. 2012 లేక 2013 నందు మీరు బాగా స్థిరపడతారు. 2013 లేక 2014 నందు మీకు వివాహం అవుతుంది. ఛండికామాతను ఆరాధించండి. మీకు కలిసివస్తుంది.