మీరు సప్తమి గురువారం, వృశ్చికలగ్నము, ఉత్తరాషాఢ నక్షత్రం ధనుర్‌రాశి నందు జన్మించారు. 2012 ఆగస్టు వరకు ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొన్నా 2013 నుంచి సత్‌కాలం ప్రారంభమవుతుంది.
2013 నందు మీరు అనుకున్నది సాధించగలుగుతారు. మీ 23వ సంవత్సరము నందు వివాహం అవుతుంది. మంచి యోగ్యుడు, విద్యావంతుడైన భర్త లభిస్తాడు. ప్రతిరోజూ జ్ఞాన సరస్వతిని తెల్లని గులాబీ పూలతో పూజించడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది.