మీరు సప్తమి బుధవారం, కుంభలగ్నము, అశ్వని నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. లగ్నము నందు బుధుడు ఉండటం వల్ల, స్వయం కృషితో మీరు బాగా అభివృద్ధి చెందుతారు. ధన, కుటుంబ, వాక్ స్థానము నందు కుజ, గురు, రాహువు ఉండటం వల్ల కృషితో నాస్తి దుర్భిక్షమ్ అన్నట్లుగా కృషి వల్ల మీరు సత్ఫలితాలను పొందుతారు.
మీ 24 లేక 25వ సంవత్సరము నందు బాగా స్థిరపడతారు. 2012 మే నుంచి రవి మహర్ధశ ప్రారంభమవుతుంది. ఈ రవి ఆరు సంవత్సరాలు మంచి యోగాన్ని ఇస్తుంది. ప్రతిరోజూ ఆదిత్యుడిని ఆరాధించడం వల్ల ఆటంకాలు తొలగి అభివృద్ధి చెందుతారు.