మీరు త్రయోదశి శనివారం, తులాలగ్నము, ఉత్తరానక్షత్రం సింహరాశి నందు జన్మించారు. లగ్నము నందు బృహస్పతి ఉండటం వల్ల కష్టపడి పని చేసి మీరు బాగుగా అభివృద్ధి చెందారు. అందరికీ సహాయం చేసి మాటపడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి.
2012 ఆగస్టు వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతిశనివారం 9 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినా శుభం కలుగుతుంది. ఆదిత్యుడిని మంకెన పూలతో పూజించినా శుభం కలుగుతుంది. 2013 లేక 2014 నందు మంచి మార్పు, అభివృద్ధి కానరాగలదు. 2014 నుంచి శని మహర్ధశ 19 సంవత్సరాలు సత్ఫలితాలను పొందుతారు.