సాగర్ గారూ.. నవగ్రహ ప్రదక్షణ చేసినా దోషాలు తొలగిపోతాయి
ఎమ్.ఎస్.కె.సాగర్-మహబూబ్నగర్:
Advertiesment
, శనివారం, 16 జూన్ 2012 (17:59 IST)
FILE
ఎమ్.ఎస్.కె.సాగర్-మహబూబ్నగర్:
మీరు నవమి శనివారం, సింహలగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల, నెలకు ఒక శనివారం నాడు 16 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినా దోషాలు తొలగిపోతాయి. రాజ్యస్థానము నందు రాహువు ఉండటం వల్ల ఏ రంగాల్లోనూ అభివృద్ధి చెందలేకపోయారు.
మీరు వ్యాపార, కళా రంగాల్లో బాగా రాణిస్తారు. 2006 నుంచి బుధ మహర్ధశ ప్రారంభమైంది. ఈ బుధుడు 2014 నుంచి 2023 వరకు అనుకోని అభివృద్ధినిస్తాడు. ఈ సమయంలో మీరు కృషి చేసినా బాగా అభివృద్ధి చెందుతారు.
మీకు వివాహం కాకుండా అభివృద్ధి ఉండజాలదు. మీ 29లేక 30 సంవత్సరము నంద వివాహం అవుతుంది. యోగ్యురాలు, విద్యావంతురాలైన భార్య లభిస్తుంది. వివాహానంతరం మీరు బాగా రాణిస్తారు.