శ్రీవాణి గారూ.. చామంతి పూలతో శనిని పూజించండి
, గురువారం, 31 మే 2012 (18:23 IST)
శ్రీవాణి మీరు పాడ్యమి సోమవారం, కన్యాలగ్నము, జ్యేష్ట నక్షత్రం వృశ్చికరాశి నందు జన్మించారు. 2019 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల, ప్రతీ శనిత్రయోదశికి శనికి తైలాభిషేకం చేయించి చామంతి పూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి. లగ్నము నందు కుజుడు ఉండటం వల్ల మంచి పట్టుదలతో మీరు అనుకున్నది సాధించగలుగుతారు. 2001 నుంచి శుక్ర మహర్ధశ ప్రారంభమైంది.ఈ శుక్రుడు 2014 నుంచి 2021 వరకు మంచి యోగాన్ని ఇస్తాడు. భాగ్యస్థానము నందు రాహువు ఉండటం వల్ల అందరికీ సహాయం చేసి మాటపడతారు. జాగ్రత్త వహించండి. జుట్టు ఎక్కువగా ఊడిపోవడం జ్ఞాపక శక్తి తగ్గడం, ప్రతీ చిన్న విషయానికి ఆందోళన చెందడం, కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు వంటివి ఉండగలవు. గరుడపచ్చ అనే రాయిని ధరించినా శుభం కలుగుతుంది.