మీరు నవమి శనివారం, తులా లగ్నము, శ్రవణ నక్షత్రం, మకరరాశి నందు జన్మించారు. లగ్నము నందు రవి, బుధ, కుజ, గురులు ఉండటం వల్ల వివాహానంతరం మీరు బాగా అభివృద్ధి చెందుతారు. కుటుంబ స్థానము నందు రాహువు ఉండటం వల్ల, వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరం అని గమనించండి.
2007 నుంచి రాహు మహర్ధశ ప్రారంభమైంది. ఈ రాహువు 2012 డిసెంబరు నుంచి 2025 వరకు యోగాన్ని, తదుపరి గురు మహర్ధశ 16 సంవత్సరాలు మంచి యోగాన్ని ఇవ్వగలదు. తొందరపడి సంభాషించడం మంచిది కాదని గమనించండి. ప్రతీరోజు శారదాదేవిని పూజించడం వల్ల తొలగి అభివృద్ధి చెందుతారు.