మీరు ద్వాదశి ఆదివారం, కర్కాటక లగ్నము, చిత్త నక్షత్రం, తులారాశి నందు జన్మించారు. భార్యస్థానము నందు బృహస్పతి ఉండటం వల్ల మంచి యోగ్యురాలు, విద్యావంతురాలు ఉత్తమురాలైన భార్య లభిస్తుంది. వివాహ విషయంలో జాతక పరిశీలన చాలా అవసరమని గమనించండి.
ఒక సంబంధం అనుకుని ఆగిన తదుపరి మీకు వివాహం అవుతుంది. మీ 28 లేక 29వ సంవత్సరము నందు వివాహం అవుతుంది. 2017 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని పూలతో శనిని పూజించినా సర్వదోషాలు తొలగిపోతాయి.