మీ కుమార్తె ఏకాదశి గురువారం, వృషభ లగ్నము, ఆశ్లేష నక్షత్రం, కర్కాటకరాశి నందు జన్మించారు. భాగ్యస్థానము నందు రాహువు, కుజ, శనులు ఉండటం వల్ల, తృతీయ స్థానము నందు చంద్ర, కేతువులు ఉండటం వల్ల, గ్రహ బంధన దోషం ఏర్పడటం వల్ల శంఖచూడా కాలసర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషానికి శాంతి చేయించండి.
మీ 23 లేక 24వ సంవత్సరము నందు బాగా సంవత్సరము నందు బాగా స్థిరపడతారు. మీకు ఆకస్మికంగా వివాహం అవుతుంది. మంచి యోగ్యుడు ఉత్తముడైన భర్త లభిస్తాడు. 2014 చివరకి వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల మూడు నెలలకు ఒక శనివారం నాడు 17సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి సువర్ణగన్నేరు పూలతో శనిని పూజించినా శుభం కలుగుతుంది.