Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రుణ విముక్తికి రుణ విమోచనా గణపతిని పూజించండి

Advertiesment
భవిష్యవాణి
, బుధవారం, 1 ఫిబ్రవరి 2012 (15:06 IST)
సురేష్

మీరు విదియ సోమవారం మకరలగ్నము స్వాతి నక్షత్రం తులారాశి నందు జన్మించారు. 2017 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ఆర్థిక ఒడిదుడుకులు, చికాకులు వంటివి ఎదుర్కొంటున్నారు. ప్రతీ శనివారం 18సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని పూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి. రుణ విమోచనా గణపతిని పూజించినా రుణవిముక్తులవుతారు. 2007 నుంచి శని మహర్ధశ ప్రారంభమైంది. ఈ శని 2013 నుంచి 2026 వరకు సత్ఫలితాలను ఇవ్వగలవు. 2013 లేక 2014 నందు రుణాల నుంచి బయటపడతారు.

మీ భార్య వాణి అష్టమి బుధవారం, మీనలగ్నము, విశాఖ నక్షత్రం తులారాశి నందు జన్మించారు. మీ భార్యకు కూడా 2017 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 16సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి తెల్లని పూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి. వర్తమానం 2012 నుంచి బుధ మహర్ధశ ప్రారంభమైంది. ఈ బుధుడు 17 సంవత్సరములు యోగాన్ని ఇస్తాడు. ప్రతీ రోజు కనకధారా స్తోత్రం చదివినా లేక విన్నా శుభం కలుగుతుంది.

మీ కుమారుడు సాత్విక్ నవమి మంగళవారం, వృషభలగ్నము, విశాఖ నక్షత్రం, వృశ్చిక రాశి నందు జన్మించాడు. 2019 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల మూడు నెలలకు ఒకసారి ఒక శనివారంనాడు 16సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినా శుభం కలుగుతుంది. లగ్నము నందు గురు, శనులు ఉండటం వల్ల చదువుల్లో బాగా రాణిస్తారు. 24 సంవత్సరము నందు బాగా రాణిస్తారు.

మీ కుమారుడు సాహిత్ ఏకాదశి శనివారం, సింహలగ్నము, ఆరుద్ర నక్షత్రం మిథునరాశి నందు జన్మించాడు. 2017 ఆగస్టు వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 18సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినా స్థిరబుద్ధి అభివృద్ధి చేకూరుతుంది. రాజ్యస్థానము నందు శని ఉండటం వల్ల, సాంకేతిక రంగాల్లో బాగుగా రాణిస్తారు. దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల శుభం కలుగుతుంది.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

Share this Story:

Follow Webdunia telugu