రామకృష్ణ.. మీరు ప్రతిరోజూ సంకల్ప సిద్దిగణపతిని పూజించండి
రామకృష్ణ - హైద్రాబాద్:
Advertiesment
, శనివారం, 1 డిశెంబరు 2012 (13:03 IST)
FILE
రామకృష్ణ - హైద్రాబాద్:
మీరు తదియ గురువారం, కర్కాటకలగ్నము చిత్త నక్షత్రం తులారాశి నందు జన్మించారు. 2017 వరకు ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి 7 వత్తులు ఏకం చేసి నువ్వుల నూనెతో శనికి దీపారాధన చేయండి. శుభం కలుగుతుంది.
ఏదైనా దేవాలయాల్లో కాని, విద్యాసంస్థల్లో గాని, ఖాళీ ప్రదేశాల్లోగాని తాటిచెట్టును నాటి దాని అభివృద్ధికి తోడ్పడండి. ప్రతీరోజు సంకల్పసిద్ధిగణపతిని పూజించినా సర్వదా శుభం, జయం చేకూరుతుంది.
2003 నుంచి గురుమహార్థశ ప్రారంభమయింది. ఈ గురువు 2014 నుంచి 2019 వరకు మంచి యోగాన్ని ఇస్తుంది. 2013 ఫిబ్రవరి తదుపరి ఎటువంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోండి.