మీరు పాడ్యమి ఆదివారం కర్కాటకలగ్నము, విశాఖ నక్షత్రం తులారాశి నందు జన్మించారు. శ్రీ వేంకటేశ్వరుడిని పున్నాగపూలతో పూజించండి. మీకు ఆటంకాలు తొలగిపోతాయి. 2017 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 16 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేయించినా శుభం కలుగుతుంది.
భాగ్యాధిపతి అయిన బృహస్పతిని కేతువు పట్టడం వల్ల, గ్రహబంధన దోషం ఏర్పడటం వల్ల, విషధారాకాలసర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషానికి శాంతి చేయించండి. శుభం కలుగుతుంది. మీ 31 లేక 32 సంవత్సరము నందు వివాహం అవుతుంది. వివాహానంతరం మీరు బాగా అభివృద్ధి చెందుతారు. 2007 నుంచి బుధ మహర్ధశ ప్రారంభమైంది. ఈ బుధుడు 2013 ఏప్రిల్ నుంచి 2024 వరకు అభివృద్ధినిస్తాడు.