ప్రవీణ్.. మీరు కనకధార స్తోత్రం చదవండి.. శుభం కలుగుతుంది
ప్రవీణ్-వరంగల్:
Advertiesment
, శుక్రవారం, 25 మే 2012 (18:03 IST)
FILE
ప్రవీణ్-వరంగల్:
మీరు దశమి ఆదివారం, తులా లగ్నము, పుబ్బ నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. లగ్నము నందు శని ఉచ్ఛి చెందడం వల్ల మీకు మంచి భవిష్యత్తు ఉంది. ధనస్థానము నందు రవి, బుధ, కేతువులు ఉండటం వల్ల మీరు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ కార్పొరేట్ సంస్థల్లో కానీ స్థిరపడతారు.
2012 ఆగస్టుతో ఏలినాటి శనిదోషం తొలగిపోతున్నందువల్ల 2013 నుంచి ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది. 2010 నుంచి రాహు మహర్ధశ ప్రారంభమైంది. ఈ రాహువు 18 సంవత్సరాలు 78 శాతం యోగాన్ని ఇస్తుంది. ఈ రాహువు 2013 నుంచి 2028 వరకు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇవ్వగలదు. కనకధార స్తోత్రం చదవడం వల్ల లేక వినడం విల్ల మీకు శుభం కలుగుతుంది.