పి. వెంకట రవి కుమార్.. వేపనూనెతో శనికి దీపారాధన చేయండి
పి. వెంకట రవి కుమార్ - దొడ్డవరం
Advertiesment
, శుక్రవారం, 8 ఫిబ్రవరి 2013 (18:20 IST)
FILE
పి. వెంకట రవి కుమార్ - దొడ్డవరం
మీరు తదియ శుక్రవారం, వృశ్చిక లగ్నము, హస్త నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి 10 ఒత్తులు ఏకం చేసి వేపనూనెతో శనికి దీపారాధన చేసినా మీకు శుభం కలుగుతుంది. ఏదైనా దేవాలయాలలో కానీ, విద్యాసంస్థలలో కానీ, ఖాళీ ప్రదేశాలలో కానీ "కుంకుడు" చెట్టును నాటినా మీకు సర్వదోషాలు తొలగి శుభం కలుగుతుంది.
రాజ్యస్థానమునందు కేతువు ఉండటం వల్ల తాత్కాలికంగా మీరు ఉద్యోగం చేసినా భవిష్యత్తులో మీరు వ్యాపారాలలో రాణిస్తారు. 2013 నవంబరు తదుపరి మీకు మంచి అవకాశం లభిస్తుంది. సద్వినియోగం చేసుకోండి. మీ 26 లేక 27 సంవత్సరముల నందు వివాహం కాగలదు. వరసిద్ధివినాయకుడిని గరికెతో పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి.
2001 నుంచి రాహుమహర్థశ ప్రారంభమయింది. ఈ రాహువు 2014 నుంచి 2019 వరకు యోగాన్ని తదుపరి గురు మహర్థశ మంచి యోగాన్ని ఇవ్వగలదు.