మీరు ద్వాదశి బుధవారం కర్కాటకలగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. భార్యస్థానము నందు కుజుడు ఉచ్ఛి చెందటం వల్ల, ఈ కుజుడు రాజ్యాధిపతి అవ్వడం వల్ల శని, కుజులకు పరివర్తనాయోగం ఉన్నందువల్ల వివాహానంతరం మీరు ఉజ్వల భవిష్యత్తు ఉంది. మీరు 26 లేక 27 సం||ము నందు వివాహాం ఉంది.
2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారంనాడు 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినా శుభం కలుగుతుంది. 2015 వరకు కేతు మహర్థశ సామాన్యమైన యోగాన్ని ఇస్తుంది. తదుపరి శుక్ర మహర్థశ 20 సం||ములు ఉన్నత స్థితిలో స్థిరపడతారు. ప్రతీరోజూ బాలాత్రిపురసుందరిదేవి పూజించడం వల్ల శుభం కలుగుతుంది.