నాగలక్ష్మీ... మీకు ఉత్తముడైన భర్త లభిస్తాడు
నాగలక్ష్మీ- ప్రొద్దుటూరు:మీరు చతుర్థశి శుక్రవారం కన్యాలగ్నము, ఆశ్రేష నక్షత్రం, కర్కాటకరాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం, 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి పచ్చని పూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి. భర్తస్థానము నందు కుజుడు ఉండటంవల్ల వివాహం ఆలస్యం అవ్వడం కూడా ఒకందుకు మంచిదేనని గమనించండి. 2014 ఫిబ్రవరి నుంచి అక్టోబరు లోపు వివాహం అవుతుంది. యోగ్యుడు, ఉత్తముడైన భర్త లభిస్తాడు. కార్తీకేయుడిని పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి.గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి