దుర్గా కళ్యాణ చక్రవర్తి.. మీకు 32వ ఏట వివాహం అవుతుంది
, బుధవారం, 20 జూన్ 2012 (17:50 IST)
దుర్గా కళ్యాణ చక్రవర్తి మీరు షష్ఠి సోమవారం, సింహలగ్నము, హస్త నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్య బంధించబడటం వల్ల భార్యస్థానాధిపతి అయిన శని ద్వితీయస్థానము నందు ఉండటం వల్ల, విషధారాకాల సర్పదోష శాంతి చేయించండి. మీకు అన్ని విధాలా శుభం కలుగుతుంది. వివాహానంతరం మీకు బాగుగా అభివృద్ధి చెందుతారు. మీ 31లేక 32 సంవత్సరము నందు వివాహం అవుతుంది. 2014 చివరి వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 17సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి సువర్ణగన్నేరు పూలతో శనిని పూజించినట్లైతే దోషాలు తొలగిపోతాయి.