చంద్రశేఖర్ గారూ... కార్తికేయుడిని ఎర్రని పూలతో పూజించండి
చంద్రశేఖర్-విశాఖపట్నం:మీరు దశమి ఆదివారం, సింహలగ్నము, ధనిష్ట నక్షత్రం మకరరాశి నందు జన్మించారు. మీకు తూర్పు, దక్షిణ ముఖాలు గల గృహం కలిసివస్తుంది. మనఃకారకుడైన చంద్రుడు రాహువుతో కలియిక వల్ల ప్రతీ చిన్న విషయానికి ఆందోళన చెందటం, మంచి పట్టుదల వంటివి ఉండగలవు. కార్తికేయుడిని ఎర్రని పూలతో పూజించడం వల్ల మీకు శుభం, జయం, పురోభివృద్ధి కానవస్తుంది. 2012 నుంచి శని మహర్థశ ప్రారంభమయింది. ఈ శని 2015 నుంచి 2031 వరకు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇవ్వగలదు.