ఒక సంబంధం అనుకుని ఆగిన తర్వాత మరో సంబంధంతో పెళ్లవుతుంది...
కీర్తి: మీరు ద్వాదశి శనివారం, తులా లగ్నము, ఆరుద్ర నక్షత్రం, మిథునరాశి నందు జన్మించారు. భర్తస్థానము నందు రాహువు ఉండటం వల్ల ఒక సంబంధం అనుకొని ఆగినతదుపరి మీకు వివాహం అవుతుంది. మీ 26 సం||ము నందు వివాహం కాగలదు. మంచి యోగ్యుడు, ఉత్తముడు, విద్యావంతుడైన భర్త లభిస్తాడు. ప్రతిరోజు వరసిద్ధివినాయకుడిని పూజించడం వల్ల సర్వదోషాలు తొలగి బుద్ధిస్థిమితం వస్తుంది.మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.