ఎ. మురళీకృష్ణ.. మీకు 2013 ఆగస్టులోపు మీకు పునర్వివాహం అవుతుంది
ఎ. మురళీకృష్ణ-తగరపువలస
Advertiesment
, బుధవారం, 14 మార్చి 2012 (15:35 IST)
ఎ. మురళీకృష్ణ-తగరపువలస
మీరు ఏకాదశి శనివారం, ధనుర్‌లగ్నము, ఆశ్లేష నక్షత్రం కర్కాటకరాశి నందు జన్మించారు. భాగ్యస్థానము నందు చంద్ర, రాహువులు ఉండటం వల్ల, శంఖచూడా కాలసర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషానికి శాంతి చేయించండి. భార్యస్థానాధిపతి అయిన బుధుడు లాభము నందు ఉండటం వల్ల మీకు భార్య వియోగం జరిగింది.
2012 ఆగస్టు నుంచి 2013 ఆగస్టు లోపు మీకు పునర్వివాహం అవుతుంది. 2014 చివరి వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతీశనివారం 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి చామంతి పూలతో పూజించడం వల్ల మీకు శుభం కలుగుతుంది. 2014 లోపు రుణ విముక్తులవుతారు. 2014 నుంచి రవి మహర్ధశ ఆరు సంవత్సరములు, చంద్ర మహర్ధశ పది సంవత్సరములు మంచి యోగాన్ని, అభివృద్ధిని ఇస్తుంది.