మీరు త్రయోదశి సోమవారం, మకరలగ్నము, అనూరాధ నక్షత్రం, వృశ్చికరాశి నందు జన్మించారు. 2019 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నప్పటికినీ ఈ శని మీకు మంచి అభివృద్ధినిస్తాడు. 2013 లేక 2014 నందు ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు. ప్రతీ శనిత్రయోదశికి శనికి తైలాభిషేకం చేయించండి. 2015 వరకు శుక్రమహర్ధశ యోగాన్ని ఇస్తుంది.
తదుపరి రవి మహర్ధశ ఆరు సంవత్సరములు, చంద్ర మహర్ధశ పది సంవత్సరములు అనుకోని అభివృద్ధి ఇవ్వగలడు. సంకల్పసిద్ధి గణపతిని పూజించండి. మీ సంకల్పం సిద్ధిస్తుంది.