Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

22-09-2021 బుధవారం రాశిఫలాలు - లక్ష్మీనృశింహస్వామి ఆరాధించినా...

Advertiesment
22-09-2021 బుధవారం రాశిఫలాలు - లక్ష్మీనృశింహస్వామి ఆరాధించినా...
, బుధవారం, 22 సెప్టెంబరు 2021 (04:00 IST)
మేషం : ముఖ్యులను కలుసుకున్నా కార్యం నెరవేరదు. కిరాణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు సంతృప్తికానవస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
వృషభం : సాహస ప్రయత్నాలు విరమించండి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. ఉపాధ్యాయులకు పనిలో ఒత్తిడి, చికాకులు వంటివి తలెత్తుతాయి. స్త్రీలకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. రావలసిన బకాయిలు సకాలంలో అందుతాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు.
 
మిథునం : రావలసిన బకాయిలు సకాలంలో అందుతాయి. గతంలో చేజారిన పత్రాలు చేతికందుతాయి. కుటుంబీకులతో కలిసి దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తుల ఓర్పు, పనితనానికి పరీక్షా సమయం. స్త్రీలకు పనిభారం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. సాహిత్య కళా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కర్కాటకం : పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. రాజకీయాలలో వారు ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ యత్నం వాయిదాపడుతుంది. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. 
 
సింహం : ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. చిరు పరిచయాలు మరింతగా బలపడతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. 
 
కన్య : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మిమ్మలన్ని చూసి అసూయపడేవారు అధికం అవుతున్నారని గ్రహించండి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కూరగాయలు, పండ్లు, పూల వ్యాపారస్తులకు పురోభివృద్ధి. 
 
తుల : ఉద్యోగస్తులు అధికారులతో మాటపడకుండా తగిన జాగ్రత్తలు వహించండి. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. మీ సంతానం మొండివైఖరి కారణంగా చికాకులను ఎదుర్కోవలసి వస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలల పాల్గొంటారు. బాధ్యతలు మిమ్మలను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. 
 
వృశ్చికం : అపనిందలుపడే పరిస్థితులున్నాయి. జాగ్రత్త వహించండి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల ఇబ్బందులు తప్పవు. సోదరీ, సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. ఖర్చులు పెరిగినా ఇబ్బందులు ఉండవు. గృహాలంకరణ నిమిత్తం ఖర్చు చేస్తారు. 
 
ధనస్సు : పారిశ్రామిక కార్మికుల మధ్య పరస్పర అవగాహన లోపం. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. దైవ, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. ముఖ్య విషయాల్లో మీ జీవిత భాగస్వామి సలహా, సహకారం తీసుకోవడం మంచిది. స్త్రీల సృజనాత్మతకు, ప్రతిభకు తగిన గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
మకరం : బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలు శారీరక మానసిక వేదనకు గురవుతారు. బంధు మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ప్రైవేటు సంస్థల్లో వారు మార్పులకై చేయు యత్నాల్లో సఫలీకృతులవుతారు. పాత రుణాలు తీరుస్తారు.
 
కుంభం : బంధువుల రాకవల్ల గృహంలో సందడి కానస్తుంది. ప్రైవేటు సంస్థల్లోని వారికి బరువు బాధ్యతలు అధికమవుతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. కోర్టు పనులు వాయిదాపడతాయి. ముఖ్యుల కోసం విరివిగా ధనవ్యయం చేస్తారు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. 
 
మీనం : స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. మీ కుటుంబీకుల మొండివైఖరి మీకెంతో ఆందోళన కలిగించగలదు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. విదేశీ ప్రయాణాలలో అడ్డంకులు తొలగిపోతాయి. శ్రీమానంతరం మీరు కోరుకున్న ప్రాజెక్టులను దక్కించుకుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహాలయ పక్షం ప్రారంభం.. పితృదేవతా పూజలు తప్పక చేయాలట!