Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

22-11-2022 మంగళవారం దినఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధించడంవల్ల శుభం..

anjaneya swamy
, మంగళవారం, 22 నవంబరు 2022 (04:00 IST)
మేషం :- ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలలో సంతృప్తిగా సాగుతాయి. మీ జీవిత భాగస్వామి ప్రోద్బలంతో ఒక శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. రిప్రజెంటేటివ్‌లకు, మార్కెటింగ్ రంగాల్లో వారికి ప్రయాణాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
వృషభం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. రాజకీయాలలో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. దైవ, పుణ్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించండి. మీ సంతానం మొండితనం ఇబ్బందులకు దారితీస్తుంది.
 
మిథునం :- స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. స్థిరాస్తి కొనుగోలు, లేదా అమ్మకానికై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి అధికం. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది.
 
కర్కాటకం :- కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మార్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలించకపోవచ్చు. వృధా ఖర్చులు అదుపుచేయాలన్న మీ యత్నం నెరవేరదు. కార్యసాధనలో ఆటంకాలు అధికమిస్తారు. అకాలభోజనం, శ్రమాధిక్తవల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
సింహం :- వైద్య రంగాల వారికి ఏకాగ్రత ముఖ్యం. బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రేమికులకు సన్నిహతుల ప్రోత్సహం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకొండి.
 
కన్య :- స్థిరాస్తిని అమర్చుకోవాలనే కోరిక నేరవేరుతుంది. గత స్మృతులు జ్ఞప్తికి వస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులతో అవగాహన కుదురదు. రాజకీయాలలో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
తుల :- బంధువుల రాకవల్ల గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటుచేసుకుంటుంది. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం విరమించు కోవటం శ్రేయస్కరం.
 
వృశ్చికం :- నిరుద్యోగులకు ప్రకటనల పట్ల ఏకాగ్రత అవసరం. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. హామీలు, బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి లాభదాయకం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. సభలు, సమావేశాలలో పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు.
 
ధనస్సు :- బంధు మిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తే సూచనలు గోచరిస్తున్నాయి. చేపట్టిన పనులుకొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు. కాంట్రాక్టర్లకు అవకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేక పోవచ్చు. స్త్రీలకు దైవ కార్యాల పట్ల ఆసక్తి నెలకొంటుంది.
 
మకరం :- వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారులకు అన్ని విధాల కలిసిరాగలదు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు ఆలస్యంగా అందుతాయి. పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు పనిభారం అధికం అవుతుంది.
 
కుంభం :- ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. లౌక్యంగా వ్యవహరించి మీ లక్ష్యాలను సాధిస్తారు. ఆకస్మిక ఖర్చులు ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి తప్పదు. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం.
 
మీనం :- ఆర్థికస్థితిలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి. స్త్రీలకు బంధువులతో పట్టింపు లెదురవుతాయి. రేషన్ డీలర్లు, ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల వేధింపులు అధికం. వార్తా సంస్థలలోనివారికి తోటివారితో అభిప్రాయభేదాలు, ఇతరత్రా చికాకులు తలెత్తుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని అభాసుపాలవుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

21-11-2022 సోమవారం దినఫలాలు - లలిత సహస్రనామం చదివినా లేక విన్నా శుభం...