Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

16-07-2022 శనివారం రాశిఫలాలు ... అనంత పద్మనాభ స్వామిని...

Advertiesment
16-07-2022 శనివారం రాశిఫలాలు ... అనంత పద్మనాభ స్వామిని...
, శనివారం, 16 జులై 2022 (05:34 IST)
మేషం :- ఆర్థిక వ్యవహారాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. వ్యాపారాభివృద్ధికై చేయుప్రయత్నాలు అనుకూలించవు. దైవదర్శనం చేయుసూచనలు కలవు. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులు మార్పులకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి.
 
వృషభం :- ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. పెన్షన్, బీమా సమస్యలు పరిష్కారం అవుతాయి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత ఎంతో ముఖ్యం.
 
మిథునం :- ఇరుగు పొరుగు వారి మధ్యకలహాలు అధికమవుతాయి. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. మార్కెట్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. దైవస్మరణ వలన మనశ్శాంతి కలుగుతుంది. బంధు, మిత్రులను కలుసుకుంటారు.
 
కర్కాటకం :- ఎప్పటినుంచో కలవాలనుకున్న ఆత్మీయులను కలిసే అవకాశం ఉంది. హామీలు, మధ్యవర్తిత్వాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఇంట్లో మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. కానివేళలో ఇతరుల గాక ఇబ్బంది కలిగిస్తుంది. రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదా పడటం వల్ల ఆందోళనకు గురవుతారు.
 
సింహం :- మీ వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించడి. కుటుంబ విషయాల్లో గతానుభవం ఉపయోగపడుతుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. స్త్రీలకు పనిభారం వల్ల ఆరోగ్యములో సమస్యలు తలెత్తుతాయి. మిత్రులను కలుసుకుంటారు. సమావేశాలకు ఏర్పాటు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
 
కన్య :- భాగస్వామ్య చర్చల్లో కొన్ని అవరోధాలు తలెత్తుతాయి. జాగ్రత్త వహించండి. కుటుంబ సౌఖ్యం కొంత తక్కువని చెప్పవచ్చు. పనులు మొదలెట్టే సమయానికి ఆటంకాలెదురవుతాయి. బంధు మిత్రులను కలుసుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒత్తిడి తప్పదు. ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి.
 
తుల :- ఒంటరిగానే లక్ష్యాలను సాధిస్తారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కంప్యూటర్, ఎలక్ట్రానికల్, టెక్నికల్ రంగాలలో వారికి కలిసివస్తుంది. కుటుంబంలో ఒకరి ధోరణి మీకు ఎంతో బ్యాంకింగ్ వ్యవహారాల పట్ల అప్రమత్తత అవసరం. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు.
 
వృశ్చికం :- ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు యత్నాలలో జయం పొందుతారు. దుబారా ఖర్చులు అధికం. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. ప్రయాణాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు.
 
ధనస్సు :- విదేశాల నుంచి ప్రత్యేక విషయాలు విని సంతోషిస్తారు. మీ ఆంతరంగిక, కుటుంబ విషయాలు ఇతరుల ముందు ఏకరువు పెట్టడం మంచిదికాదు. వాయిదా పడిన పనులు పునఃప్రారంభిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. ముఖ్యులలో ఒకరి గురించి ఆందోళన చెందుతారు.
 
మకరం :- మీ కృషికి ప్రోత్సాహం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది అని గమనించండి. సంతానం భవిష్యత్తు కోసం పొదుపు పథకాలు చేపడతారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. సేవా సంస్థలకు విరాళాలివ్వటం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. పనివారలతో ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
కుంభం :- రావలసిన ఆదాయంలో కొంత మొత్తం అందుతుంది. అవసరాలు, కోరికలు నెరవేరుతాయి. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.
 
మీనం :- సంఘంలో గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఒక శుభకార్యం దిశగా యత్నాలు సాగిస్తారు. చిన్నతరహా పరిశ్రమలు, చిరువ్యాపారులకు ఆశాజనకం. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. లక్ష్య సాధనలో సన్నిహితుల సహకారం కొరవడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తుమ్ముల ఫలితాలు.. ఉదయాన్నే లేవగానే తుమ్మితే..?