సూర్య స్తుతి ఆరాధించిన శుభం కలుగుతుంది.
మేషం:- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల, వస్తువులపట్ల మెళుకువ అవసరం. ప్రతి అవకాశం చేతిదాకా వచ్చి జారిపోవటంతో నిరుత్సాహానికి లోనవుతారు. బందువుల రాక మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. స్త్రీలకు తలపెట్టిన పనులు వాయినదాపడతాయి.
వృషభం:- రుణాలు, చేబదుళ్ళు స్వీకరించవలసి వస్తుంది. స్త్రీలకు అకాలభోజనం వల్ల ఆరోగ్యములో ఇబ్బందులు తప్పవు. నూతన పరిచయాలేర్పడతాయి. ఆత్మీయుల నుంచి అందిన ఆహ్వానం మిమ్ములను ఇరకాటానికి గురిచేస్తుంది. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి ఊహించని చికాకులెదుర్కోవలసి వస్తుంది.
మిధునం:- కొన్ని విషయాల్లో ఇతరుల సహాయం అర్ధించటానికి మొహమ్మాటపడతారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచడం చాలా అవసరం. ఉద్యోగ యత్నాలు ప్రోత్సాహ కరంగా సాగుతాయి. గృహ నిర్మాణాలకు కావలసిన అనుమతులు, వనరుల కోసం తీవ్రంగా యత్నిస్తారు.
కర్కాటకం:- వస్త్ర, ఫ్యాన్సీ, స్టేషనరీ, పాదరక్షల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రైవేటు సంస్థలలోని వారు మరో ఉద్యోగంలో చేరే విషయంలో పునరాలోచన మంచిది. రుణాల కోసం అన్వేషిస్తారు. ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పులు గమనిస్తారు.
సింహం:- ఆర్థిక వ్యవహరాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల ఆరోగ్యము కుదుటపడుతుంది. స్త్రీలకు అలంకరణలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. చేతివృత్తులు, క్యాటరింగ్ పనివారలకు శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు.
కన్య:- మీ సంతానం కోసం ధనం బాగా వ్యయం చేయవలసి వస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు మీరే చేసుకోవటం మంచిది. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. గృహంలో చికాకులు తొలగి ప్రశాంతత నెలకొంటుంది.
తుల:- ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని అనుకున్న పనులు పూర్తి కావు. ఆప్తులు అందించిన సమాచారం మీకెంతగానో ఉపకరిస్తుంది. స్త్రీలకు టి.వి. ఛానెళ్ళ కార్యక్రమాల సమాచారం అందుతుంది. కొబ్బరి, పండ్ల, పూల, తమలపాకులు, చిరు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు.
వృశ్చికం:- ఆదాయ, వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. స్త్రీలకు ఒక శుభకార్యం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. పాత బాకీలు వసూలు చేయడం వల్ల ఆర్ధిక ఇబ్బంది తొలగుతుంది. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది.
ధనస్సు:- వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆదాయం ఆశించినంతగా ఉండదు. ప్రతి చిన్న విషయాన్ని ఇతరుల సలహ అడగటంవల్ల చులకనవుతాయి. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి పెరుగుతుంది. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
మకరం:- నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. పత్రికా సంస్థలలోని వారికి పనిభారం, ఒత్తిడి అధికమవుతాయి. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ చిన్నారుల కోసం ధనంవిరివిగా వ్యయం చేస్తారు. విద్యార్థులు క్రీడ, క్విజ్ పోటీల్లో రాణిస్తారు. ముందుచూపుతో వ్యవహరించి ఒక సమస్యనుండి గట్టెక్కుతారు.
కుంభం:– ఉద్యోగస్తుల శక్తి సామర్ధ్యాలను అధికారులు గుర్తిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికం. ఫ్యాన్సీ, బేకరీ, పండల్ల వ్యాపారుకు పురోభివృద్ధి. మీ సంతానం వల్ల ఆనందం, ఉత్సాహం పొందుతారు. ప్రత్యర్థుల విషయంలో ఏమరుపాటుతనం కూడదు. వ్యవసాయ రంగాల వారికి కూలీలతో సమస్యలు తప్పవు.
మీనం:-కావలసిన వస్తువు సమయానికి కనిపించకపోవటంతో ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకాకుండా స్థిరచిత్తంతో వ్యవహరించటం క్షేమదాయకం. ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. స్థిరచరాస్తుల వ్యవహారం పరిష్కారమవుతుంది.