Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

10-10-2024 గురువారం దినఫలితాలు : మితంగా సంభాషించండి.. వాగ్వాదాలకు దిగవద్దు...

Saibaba

రామన్

, గురువారం, 10 అక్టోబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
మితంగా సంభాషించండి. వాగ్వాదాలకు దిగవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆప్తులను వేడుకకు ఆహ్వానిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. పురస్కారాలు అందుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆచితూచి అడుగేయండి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగస్తులకు పనిభారం. ఉన్నతాధికారులకు ఒత్తిడి, ఆందోళన. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రుణసమస్యలు తొలగుతాయి. మానసికంగా స్థిమితపడతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆరోగ్యం బాగుంటుంది. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు. కన్సల్టెన్సీలను నమ్మవద్దు. పనులు ఒక పట్టాన సాగవు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. బంధువుల రాక ఉత్సాహానిస్తుంది. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. సంతానం దూకుడు అదుపు చేయండి. దూర ప్రయాణం తలపెడతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలను సమర్ధంగా నిర్వహిస్తారు. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఖర్చులు ప్రయోజనకరం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అప్రియమైన వార్త వింటారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. అయిన వారిని సంప్రదిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పనులు పురమాయించవద్దు. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కీలక వ్యవహారాలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం. ధైర్యంగా యత్నాలు సాగించండి. శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ప్రత్యేక గుర్తింపు పొందుతారు. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. ప్రముఖులతో సంభాషిస్తారు. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు చేరవేసే వ్యక్తులున్నారని గమనించండి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
రుణ సమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. దంపతులు మధ్య అవగాహన నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలు తీరవు. సన్నిహితులతో సంభాషిస్తారు. పత్రాల్లో మార్పులు సాధ్యపడవు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గురువారం అరటిచెట్టును పూజిస్తే.. ఆ దోషం తొలగిపోతుందట..