Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Today Astrology సోమవారం దినఫలితాలు - మీ సహనానికి పరీక్షా సమయం...

Astrology

రామన్

, ఆదివారం, 8 డిశెంబరు 2024 (20:03 IST)
Astrology
సోమవారం ఆస్ట్రాలజీ 
ఈ రోజు మీ దినఫలాలు 
డిసెంబరు 9వ తేదీ ఆస్ట్రాలజీ 
 
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
మీ సహనానికి పరీక్షా సమయం. ఆచితూచి అడుగేయాలి. సలహాలు, సాయం ఆశించవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఖర్చులు సామాన్యం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆత్మస్థైర్యంతో యత్నాలు సాగిస్తారు. ఆర్థికంగా ఆశించిన ఫలితాలున్నాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. శ్రమతో కూడిన్ విజయాలు లభిస్తాయి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కీలక చర్చల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శుభకార్యంలో పాల్గొంటారు. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. జూదాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. దంపతుల మధ్య అకారణ కలహం. చేసిన పనులు మళ్లీ మొదటికే వస్తాయి. ఓర్పుతో మెలగండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. విమర్శలు పట్టించుకోవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. అనాలోచిత నిర్ణయాలు తగవు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
విశేషమైన కార్యసిద్ధి ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఆహ్వానం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. పనులతో సతమతమవుతారు. దూరప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది.. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. పనులు వేగవంతమవుతాయి. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. గృహముల చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రియతములను కలుసుకుంటారు. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. లావాదేవీల్లో తప్పటడుగువేస్తారు. ఒక సమాచారం అందోళన కలిగిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఖర్చులు విపరీతం. పనులు ముందుకు సాగవు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసిద్ధికి సంకల్పబలం ముఖ్యం. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఖర్చులు తగ్గించుకుంటారు. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. పనులు వేగవంతమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుతుంది. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
దూకుడుగా వ్యవహరిస్తారు. మీ వైఖరి వివాదాస్పదమవుతుంది. ఖర్చులు అధికం. పనులు వేగవంతమవుతాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ప్రయాణం చేయవలసి వస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2025 Nostradamus Predictions: 2025లో కోటీశ్వరులయ్యే రాశులు..?