Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

07-08-2025 గురువారం ఫలితాలు - మీ ఓర్పునకు పరీక్షా సమయం...

Advertiesment
daily horoscope

రామన్

, గురువారం, 7 ఆగస్టు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. అనుకోని సంఘటన ఎదురవుతుంది. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. కష్టించినా ఫలితం ఉండదు. యత్నాలు కొనసాగించండి. సహాయం ఆశించవద్దు. ఖర్చులు విపరీతం. పనుల్లో ఒత్తిడి అధికం. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. ప్రయాణం తలపెడతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, అర్ధ, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. కీలక నిర్ణయం తీసుకుంటారు. మీ నమ్మకం వమ్ముకాదు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. ఆప్తులతో సంభాషిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు ఓర్పుతో శ్రమించాలి. భేషజాలకు పోవద్దు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఖర్చులు అదుపులో ఉండవు. రుణ ఒత్తిళ్లు అధికమవుతాయి. ఆప్తుల సాయం అందుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. ఖర్చులు అదుపులో ఉండవు. ఉన్నతిని చాటుకోవటానికి ఖర్చు చేస్తారు. చేపట్టిన పనులు సాగవు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
చిత్తశుద్ధిని చాటుకుంటారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. పదవులు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఖర్చులు అధికం. ఆపన్నులను ఆదుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఆరాంటంగా చేస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. మీ ఆతిథ్యం కొంతమందికి అపోహ కలిగిస్తుంది. ఖర్చులు అధికం. పొదుపు ధనం అందుకుంటారు. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు విపరీతం. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్థికస్థితి సామాన్యం. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. సాయం అర్ధించేందుకు మనస్కరించదు. ఆలోచనలతో సతమతమవుతారు. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ ఓర్పునకు పరీక్షా సమయం. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. సన్నిహితులతో సంభాషణ ధైర్యానిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. నగదు, పత్రాలు జాగ్రత్త. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఉల్లాసంగా గడుపుతారు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ముఖ్యమైన పత్రాలు లభ్యమవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

06-08-2025 బుధవారం ఫలితాలు - లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం...