మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. దంపతులు ఏకాభిప్రాయానికి వస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. అనవసర జోక్యం తగదు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మాట నిలబెట్టుకుంటారు. బంధువులను కలుసుకుంటారు. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. పనుల్లో ఒత్తిడి, జాప్యం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పత్రాల రెన్యువల్లో మెళకువ వహించండి. ధార్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలు కొలిక్కివస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. పత్రాలు సమయానికి కనిపించవు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతికూలతలు అధికం. ఆచితూచి అడుగేయండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. కొంతమంది మీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. అవకాశాలు చేజారిపోతాయి. ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య అకారణ కలహం.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ధన సమస్యలు కొలిక్కివస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అనుభవజ్ఞులను సంప్రదించండి. పాత పరిచయస్తులు తారసపడతారు. దైవదీక్షలు, సభ్యత్వాలు స్వీకరిస్తారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంప్రదింపులతో తీరిక ఉండదు. ఒప్పందాల్లో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. కీలక పత్రాలు జాగ్రత్త. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అధికం. బాధ్యతలు అప్పగించవద్దు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ధనమూలక సమస్యలు ఎదురవుతాయి. పనులు ఒక పట్టాన సాగవు. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఓర్పుతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. సన్నిహితుల వాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆత్మీయులతో సంభాషిస్తారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు విపరీతం, పొదుపునకు ఆస్కారం లేదు. పనులు చురుకుగా సాగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. పిల్లల విజయం ఉత్సాహాన్నిస్తుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. సంబంధ బాంధవ్యాలు విస్తరిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఖర్చులు అధికం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మొదలెట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ధైర్యంగా వ్యవహరిస్తారు. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. పాత పరిచయస్తులతో సంభాషిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు.