Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

10-04-2021- శనివారం మీ రాశి ఫలితాలు.. శివుడిని అర్చించినా సర్వాదా శుభం

webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (05:00 IST)
శివుడిని అర్చించినా సర్వాదా శుభం, జయం చేకూరుతుంది. 
 
మేషం: ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చుతప్పులు పడటం వలన మాటపడవలసి వస్తుంది. ప్లీడర్లకు తమ క్లయింట్‌ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. బ్యాంకు వ్యవహారాల్లో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. 
 
వృషభం: వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ఆకస్మిక బిల్లులు చెల్లిస్తారు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి యాజమాన్యంతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఎదుటివారితో మితంగా సంబాషించడం మంచిది. బాకీల వసూలు కాకపోగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలిస్తాయి. 
 
మిథునం: కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ శ్రీమతి సలహా పాటించి లబ్ధి పొందుతారు. ప్రయాణాల్లో చికాకులు, ప్రయాసలు తప్పవు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలిస్తాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు పనివారలతో చికాకులు, ఆరోగ్య సమస్యలు తప్పవు.
 
కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు లేకున్నా ఏదో అసంతృప్తి వెంటాడుతుంది. సమాయానికి కావలసిన వస్తువులు, పత్రాలు కనిపించకపోవచ్చు. ప్రతి విషయంలోను ఓర్పు, సంయమనం అవసరం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు, పథకాలు మునుముందు మంచి ఫలితాలను ఇస్తాయి. రాబడికి మించి ఖర్చులుంటాయి. 
 
సింహం: సొంతంగా వ్యాపారం, సంస్థలు, పరిశ్రమలు నెలకొల్పాలనే ఆలోచన బలపడుతుంది. ఉద్యోగస్తుల బదిలీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. రుణబాధలు, దీర్ఘకాలిక సమస్యలు క్రమేణా సర్దుకుంటాయి. కార్యసాధనలో అనుకూలత, చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు.
 
కన్య: బ్యాంకు వ్యవహారాలు చురుకుగా సాగుతాయి. వ్యాపార రంగాల వారికి దస్త్రం ముహూర్తం నిర్ణయిస్తారు. స్త్రీలు బంధుమిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కొంటారు. ఏదైనా విలువైన వస్తువు అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు.
 
తుల: చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులను మొండి బాకీలు వేధిస్తాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. ముఖ్యమైన పనుల్లో ఏకాగ్రత వహిస్తారు. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలుంటాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
వృశ్చికం: ఎలక్ట్రానిక్ మీడియా వారు ఊహించని సంఘటనలెదుర్కుంటారు. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. ఇతరులకు ధనసహాయం చేసినట్లైతే తిరిగి రాబట్టుకోవడం కష్టం. వృత్తి వ్యాపారాలు సామాన్యం. వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ వహించండి. పత్రిక, వార్తా సంస్థల్లోని వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
ధనస్సు: ఆర్థిక ఇబ్బందులు లేకున్నా ఏదో అసంతృప్తి వెంటాడుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. శాస్త్ర, సాంకేతిక, బోధనా సిబ్బందికి సదవకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు ఒక పట్టాన పరిష్కారం కావు. మీ జీవిత భాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు. 
 
మకరం: విద్యుత్ రంగాల వారికి పనిలో ఒత్తిడి అధికమవుతుంది. గృహంలో మార్పులకు, చేర్పులకు వాయిదా పడతాయి. వృత్తుల వారికి చికాకులు, ఒత్తిడి తప్పవు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోనవుతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి శుభం చేకూరుతుంది. 
 
కుంభం: మందులు, ఎరువులు, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసివచ్చేకాలం. ఐరన్ రంగం వారికి ఆటంకాలు, ఆప్తుల బదిలీ ఆందోళన కలిగిస్తుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. రవాణా రంగంలోని వారికి లాభదాయకం. పాత మిత్రులను కలుసుకుంటారు.
 
మీనం: పారిశ్రామికులకు విద్యుత్ లోపం వల్ల ఆందోళనకు గురవుతారు. ఒకస్థాయి వ్యక్తుల కలయిక ఆశ్చర్యం కలిగిస్తుంది. టెండర్లు చేజిక్కించుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు చికాకులు ఎదురవుతాయి. ఉన్నతస్థాయి అధికారులకు అపరిచిత వ్యక్తులను ఓ కంట కనిపెట్టడం మంచిది.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

నవగ్రహ దోషాలకు చెక్ పెట్టాలంటే...? చర్మంతో చేసిన మనిపర్సులను..?