Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సత్యనారాయణ స్వామి కొలువుతీరన ''అన్నవరం''

Advertiesment
సత్యనారాయణ స్వామి కొలువుతీరన ''అన్నవరం''
, శుక్రవారం, 22 జూన్ 2007 (16:15 IST)
తెలుగింట జరిగే ప్రతి శుభకార్యంలోనూ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం తప్పనిసరి. అటువంటిది ఆ సత్యనారాయణ స్వామి కొరువుతీరిన క్షేత్రమై అన్నవరం. ఈ క్షేత్రం ఆంధ్ర రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. రాజమండ్రికి దాదాపు 80 కి. మీ., అన్నవరం స్టేషను నుండి 3 కి.మీ. దూరంలో పంపానదీ తీరంలో ఉన్న కొండ రత్నగిరి, ఇక్కడ రత్నగిరిపై వెలిసిన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయం "అన్నవరం సత్యనారాణ దేవాలయం" గా ప్రసిద్ధిచెందింది.

ప్రతి నిత్యం సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఇక్కడ ఆచరింపబడతాయి. కొండ క్రింది నుండి పైకి నేరుగా దేవస్థానం తరపున బస్సులున్నాయి. మెట్లబాట కూడా ఉంది. క్రింది నుండి పైకి చేరటానికి నడిచి మెట్లెక్కి వెళితే సుమారు 20 నిమిషాలు పట్టవచ్చు. కొండ క్రింది దేవస్థానం సత్రములు, హొటళ్ళు ఉన్నాయి. కొండపైన కూడా విడిదికి సత్రాలు దేవస్థానం తరపున గదులతో కూడినవి ఉన్నాయి.

పంపానదీ తీరాన ఉన్న రత్నగిరి గుట్టకి ప్రతేక ప్రభావం ఉందని తెలుస్తుంది. పురాణకధల్లో- మేరువు ఇద్దరు కుమారులు భద్రుడు, రత్నకరుడుగా పేర్కునబడింది. భద్రుడు పెద్దవాడు. రత్నాకరుడు చిన్నవాడు. ఇద్దరు కూడా తమ పేరు చిరస్థాయిగా ఉండాలని తపస్సు చేయ సంకల్పించినవారు. భద్రుడే - భద్రగిరి, భద్రాచలంగాను, రత్నాకరుడు - రత్నగిరిగాను శాశ్వతత్వాన్ని సాధించారు. రెండు కొండల మీద విష్ణు స్వరూపాలే ప్రతిష్ఠతమవటం గమనార్హం.

ఇక్కడి స్వామి త్రిపాద్విభూతి మహానారాయణుడు. నారాయణస్త్రంలో అలంకరించబిడిన వాడై, హిరణ్య గర్భాత్మకుడై తనదేవేరి శ్రీ అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారి సమేతుడై శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వెలసి భక్తులకనుగ్రహం ప్రసాదిస్తున్నాడు- భక్త జన శరణ్యుడిగా సాక్షాత్కరిస్తున్నాడు. ఆలయం కూడా రెండతస్తులుగా ఉంటుంది. ఆగమశాస్త్ర విధిగా క్రింది భాగంలో యంత్ర ప్రతిష్ఠ జరిగింది. స్వామివారి దివ్య మంగళమూర్తిని రెండవ అంతస్థులో దర్శించగలము.

ప్రతి నిత్యం జరిగే కళ్యాణోత్సవాలు
శ్రీ వారి దివ్య కళ్యాణోత్సవాలు వైశాఖ శుద్ధ దశమీ విశేషోత్సవాలకు తోడు, ఉగాది, శ్రీరామనవమి, వినాయక చాతుర్థి - గణపతి నవరాత్రోత్సవాలు, శరన్నవరాత్రులు, సంక్రాంతి, శుద్ధ ఏకాదశి, భీష్మైకాదశి వగయిరా పర్వదినోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ప్రతి నిత్యమూ జరిగే అర్చనలు, పూజలు, భక్తుల సామూహిక వ్రాతాలతో అన్నవరం ఎల్లవేళలా భక్తజన సందోహంతో కళకళలాడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu