Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పర్యాటక కేంద్రంగా లక్నవరం చెరువు

Advertiesment
రాష్ట్రంలో కాకతీయులు నిర్మించిన చెరువుల్లో ఒకటి లక్నవరం
, గురువారం, 10 జులై 2008 (18:05 IST)
FileFILE
రాష్ట్రంలో కాకతీయులు నిర్మించిన చెరువుల్లో ఒకటి లక్నవరం. సముద్రాన్ని తలపించే వైశాల్యం, చుట్టూత ఆహ్లాదాన్ని పంచే పచ్చని చెట్లు, మధ్యలో ద్వీపం వంటివి దీని ప్రత్యేకతలు. దీంతో ఈ చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.4.68 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. ఈ నిధులు విడుదలైన వెంటనే నిర్మాణ పనులు చేపట్టారు. ద్వీపాలను కలుపుతూ వేలాడే వంతెనలు సైతం నిర్మించారు.

అయితే వీటిని తిలకించేందుకు వచ్చిన పర్యాటకులకు ఇక్కడకు వచ్చాక తీవ్ర నిరాశే ఎదురవుతోంది. కనీసం మంచినీరు కూడా లభించక పోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కనీస సౌకర్యాల రూపకల్పనకు నిధులు కేటాయించారు. అయితే పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu