Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అందాల అద్భుతం నాగార్జున కొండ

అందాల అద్భుతం నాగార్జున కొండ
, సోమవారం, 7 ఏప్రియల్ 2008 (17:01 IST)
నాగార్జున సాగర్ సమీపంలోనే ఉన్న మరో అద్భుతమైన ప్రాంతం నాగార్జున కొండ. ఎప్పటికైనా నాగార్జున రిజర్వాయిర్ ద్వారా మునిగే ప్రమాదం ఈ కొండకు ఉన్నప్పటికీ, దీనిని ముఖ్యమైన చారిత్రక స్థలంగా మార్చేందుకు పురావస్తు శాఖ వారు ప్రయత్నిస్తున్నారు.

కాగా ఈ నాగార్జున కొండ, రిజర్వాయిర్ మధ్యలో ఓ చిన్నపాటి ద్వీపకల్పంలా మారిపోయింది. ఈ కొండపై ఉన్న నాగార్జున మ్యూజియంలో బుధ్దదాతుకి సంబంధించిన వస్తువులు ఉన్నాయి. ఇక్కడి శిల్ప కళ శాతవాహనులు, ఇక్ష్వాకుల రాజవైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది. సున్నపు రాయి, మూడు, నాలుగు శతాబ్దాలకు సంబంధించిన శిల్పకళలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక్కడ ఉన్న బుద్దుని నిలువెత్తు విగ్రహం చాలా అందంగా ఉంటుంది. స్థానకా అనే ఆకృతిలో, కూర్చుని ఆసనాలు వేస్తున్న స్థితిలో గుండ్రంటి భుజాలతో బుద్ద విగ్రహం పర్యాటకులను ఆకర్షిస్తుంది. బుద్దుని కుడి చేయి అభయమిస్తున్నట్టు, ఏదో బోధిస్తున్నట్టు ఉంటుంది. ఈ ప్రాంతానికి వెళ్లే మార్గాల గురించిన వివరాలు కలిగిన పుస్తకాలు ఈ మ్యూజియంలోని గ్యాలరీలలో ఉంటాయి. నాగార్జున సాగర్ నుంచి మోటార్ బోట్ల ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.

అలాగే నాగార్జున సాగర్‌కు ఎనభై కి.మీ దూరంలోనే ఉంది ఎత్తిపోతల జలపాతం. చంద్రవంక కొండల్లో నుంచి ప్రవహించే ఈ జలపాతం 22 మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడి కృష్ణా నదిలో కలుస్తుంది. అంతే కాకుండా సూర్యాస్తమయం తర్వాత కూడా ఈ జలపాతం కొత్త కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. ఈ ప్రాంతానికి సమీపంలోనే అటవీ ప్రాంత విభాగం వారు నిర్వహించే మొసళ్ల కేంద్రం ఉంది. అన్నిటికన్నా నాగార్జున కొండపై నుంచి చూస్తే కనిపించే మనోహరమైన దృశ్యాలు మనసును కదిలించి వేస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu