Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ్యవస్థను మార్చే సత్తా లోక్‌సత్తాకే ఉంది: జేపీ

Advertiesment
వ్యవస్థను మార్చే సత్తా లోక్‌సత్తాకే ఉంది: జేపీ
వ్యవస్థను మార్చే సత్తా ఒక్క లోక్‌సత్తాకే ఉందని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ అన్నారు. హైదరాబాద్ నగరంలోని కార్వాన్ నియోజకవర్గం నుంచి దాదాపు 200మంది యువత ఆ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సామాజిక వ్యవస్థను మార్చే సత్తా ఒక్క లోక్‌సత్తాకే ఉందని, నిజమైన రాజకీయం సార్వత్రిక ఎన్నికల తర్వాతే ప్రారంభమౌతుందన్నారు.

ఇదిలావుండగా తమ పార్టీ వారసత్వపు రాజకీయాలను ఎట్టి పరిస్థితులలోనూ ప్రొత్సహించదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా తమ పార్టీ అసెంబ్లీ సమావేశాల్లో సభనుంచి వాకౌట్ చేయదని, సభలో నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. సామాజిక సమస్యలపై ఎల్లప్పుడూ పోరాడుతుంటామని ఆయన తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu