Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మెగా' ప్రారంభానికి సర్వసిద్ధం

'మెగా' ప్రారంభానికి సర్వసిద్ధం
WD
రాష్ట్ర రాజకీయ చిత్రపటంలోకి మరో కొత్త పార్టీ స్థానం దక్కించుకోబోతోంది. చిరంజీవి తాను పెట్టబోతున్న పార్టీ ఆవిర్భావ సభకు తిరుపతిలో సర్వం సిద్ధమయ్యింది. తిరుపతిలో మంగళవారం జరగబోయే సభ ఏర్పాట్లను చిరంజీవి సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్‌, బావమరిది అల్లు అరవింద్‌లు పర్యవేక్షిస్తున్నారు. సోమవారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

వేదిక నిర్మాణం పూర్తి చేశారు. మరోవైపు పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 2 వేల మంది పోలీసులు ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు. తిరుపతికి వచ్చే అన్ని మార్గాలను వారు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రాకపోకల నియంత్రణ కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఒక ఎస్పీ, 3 ఏఎస్పీ స్థాయి అధికారులు భద్రతను పర్యవేక్షించనున్నారు. తిరుపతి నగరం చుట్టూ 23 చోట్ల చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. అన్ని వాహనాలను నగరంలోనికి అనుమతించరు. ఇదిలా ఉండగా సోమవారం సాయంత్రం చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ సభాస్థలికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

ఇంకా పూర్తికాని పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పురమాయించారు. అక్కడే ఉన్న ఒక వికలాంగుడితో కింద కూర్చుని మాట్లాడారు. సభాస్థలి విషయానికొస్తే... గ్యాలరీలను సిద్ధం చేశారు. పోలీసులే కాకుండా వేలాది మంది వాలంటీర్లు ఇక్కడికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ నాలుగు రోజల నుంచి తిరుపతిలోనే మకాం వేశారు. ఇక పెద్దతమ్ముడు నాగబాబు కూడా తిరుపతికి వచ్చి పనులు పర్యవేక్షిస్తున్నారు.

చెన్నై నుంచి తిరుపతి వెళ్ళనున్న చిరంజీవి
సినీ హీరో చిరంజీవి సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో విమానం ద్వారా చెన్నై చేరుకుంటారు. అక్కడ నుంచి కారులో తిరుపతికి వెళతారు. రాత్రికి రాత్రే తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. మంగళవారం సభాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆ సభలో పార్టీ పేరును, విధి విధానాలను ప్రకటిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu