దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే విధంగా రాష్ట్రంలోకూడా కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించడంతో ఆ పార్టీ అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గ కసరత్తు తుది దశకు చేరుకుంది.
సోమవారం సాయంత్రం మంత్రుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా జరుతున్నాయి. రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం సాయంత్రం గం.6.40నిమిషాలకు జరగనుందని అధికారవర్గాలు వెల్లడించాయి.
ఇదిలావుండగా శనివారంనాడు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి ఆదివారం మధ్యాహ్నం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసి ఆమోదముద్ర వేసుంచుకోనున్నారు. అనంతరం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
రేపు సాయంత్రం తొలి దశలో భాగంగా 25 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.