Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభుత్వం ప్రజారాజ్యానిదే: చిరంజీవి

Advertiesment
వార్తలు కౌంట్డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ రాష్ట్రం ప్రజారాజ్యం పార్టీ ప్రభుత్వం 160 సీట్లు మెజార్టీ చిరంజీవి
రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ అధికారం చేపడుతుందని ఏ పార్టీతో పొత్తుకు అవసరం లేకుండానే తాము 160 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తెలిపారు.

ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ... ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, రాష్ట్రంలో హంగ్ ఏర్పడే ప్రసక్తే లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా తెలంగాణలో ప్రజారాజ్యంకు ఎన్ని సీట్లు వస్తాయో ఇప్పుడే చెప్పలేమని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక కేవలం వంద రూపాయలకే వంట సరకులకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేస్తామని ఆయన తెలిపారు. కాగా తమ పార్టీ సెక్యులర్ పార్టీ అని కేంద్రంలో ఎన్‌డీఏతో కలిసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu