Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజకీయాల్లోకొస్తున్నా...జగపతిబాబు...!

Advertiesment
రాజకీయాల్లోకొస్తున్నా...జగపతిబాబు...!
రానున్న రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చి క్రియాశీలకపాత్ర పోషిస్తానని ప్రముఖ సినీ హీరో, జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ అధినేత జగపతిబాబు చెప్పారు.

ఇటీవల తన చిత్రం 'అధినేత' తననెంతో ప్రభావితం చేసిందని దీంతో తాను రాజకీయాల వైపు ఆకర్షితుడనైనానని ఆ సినిమా విజయోత్సవ పర్యటనలో భాగంగా చిత్ర యూనిట్‌తో కలసి విజయవాడకు వచ్చిన సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో జగపతిబాబు తెలిపారు.

ఇదిలావుండగా రాజకీయాలలో తాను ఎలాంటి పదవులను ఆశించకుండా ప్రజల సమస్యల పరిష్కారానికి అవసరమయ్యే రాజకీయాలలో ప్రధాన పాత్ర వహిస్తానని, సమాజ శ్రేయస్సే ప్రధాన ఉద్దేశంగా తన కార్యక్రమాలుంటాయని ఆయన అన్నారు.

కాగా సమాజంలో మార్పు రావాలి. అది ప్రజలవైపు నుంచే జరగాలి అనే సందేశంతో రూపొందించిన అధినేత చిత్రం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని ఆయన చెప్పారు. కాబట్టి మరో సినీ హీరో త్వరలో రాజకీయ ఆరంగ్రేటం చేయనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu