Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణపై సరైన నిర్ణయం తీసుకున్నాం : టీడీపీ

Advertiesment
తెలంగాణపై సరైన నిర్ణయం తీసుకున్నాం : టీడీపీ
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై తెలుగుదేశం పార్టీ సకాలంలో సరైన నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.... తెలంగాణ అంశంలో తెదేపా దశల వారిగా చర్చించి తగిన నిర్ణయమే తీసుకుందని చెప్పారు.

ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ విషయంలో హడావుడిగా నిర్ణయాలు ప్రకటించాయని ఎర్రన్నాయుడు గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల్లో సెంటిమెంటు బలంగా నాటుకుపోయి ఉన్నందునే తెదేపా కోర్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.

తెలంగాణ ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన కోర్ కమిటీ సోమవారం చర్చలు జరిపింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు ప్రాంతాల నేతలు, కార్యకర్తలు నుంచి... తెదేపా కోర్‌కమిటీ సభ్యులు సేకరించిన అభిప్రాయాలను బాబు దృష్టికి తీసుకెళ్ళిన సంగతి తెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu