Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆగస్టు 15 నుంచి ఆన్‌లైన్‌లో ఉచిత వైద్య సలహా సేవ

ఆగస్టు 15 నుంచి ఆన్‌లైన్‌లో ఉచిత వైద్య సలహా సేవ
కాకినాడ (ఏజెన్సీ) , బుధవారం, 11 జులై 2007 (09:58 IST)
రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి ఆన్‌లైన్‌లో ఉచిత వైద్య సలహాల సేవను అందజేయనున్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సంబాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. భారత్‌లో ఎక్కడా లేనివిధంగా తొలిసారిగా ఈ హెల్త్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభిస్తున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా 1056 నెంబరుకు ఫోన్ చేసి వైద్య సలహాలు పొందవచ్చని ఆయన వివరించారు.

ఈ ఏడాది చివరికల్లా ఉచిత వైద్య సలహాల సేవను రాష్ట్రవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇందుకుగాను రాష్ట్రంలో ఈ ఏడాది సుమారు వెయ్యి మంది వైద్యులను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా ఈ ఉచిత వైద్య సలహాలు కేంద్రంలో బీఎస్ఎన్ఎల్ ఫోన్‌లను ఉపయోగించనున్నట్టు వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu