ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైకాపా జోరు కొనసాగుతోంది. ఈ ఫలితాల్లో ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ముఖ్యంగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోని కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం, కుప్పం మున్సిపాలిటీలో కూడా ఫ్యాను గాలివీస్తుంది.
ఈ మున్సిపాలిటీలో మొత్తం 25 స్థానాలు ఉండగా, ఒక సీటు ఏకగ్రీవం అయింది. మిగిలిన 24 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు ఫలితాలు వెలువడిన వాటిలో వైసీపీ 14 స్థానాలను సొంతం చేసుకోగా, టీడీపీ రెండు స్థానాలతోనే సరిపెట్టుకుంది.
ఇక అనంతపురం జిల్లాలోని పెనుగొండ మున్సిపాలిటీలో కూడా వైసీపీ జెండా ఎగురవేసింది. పెనుగొండలో 20 స్థానాలకు గాను వైసీపీ 18 స్థానాల్లో గెలుపొందగా, టీడీపీ ఖాతా తెరవలేదు. అదేవిధంగా ఎనిమిది నగరపంచాయతీల్లో అధికారపార్టీ గెలుపొందింది.
అలాగే, అనంతపురం జిల్లా పెనుకొండలో వైసీపీ విజయదుందుభి మోగించింది. మొత్తం 20 వార్డులకు గాను 18వ వార్డులో గెలుపొందింది. రెండు వార్డులలో మాత్రమే టిడిపి విజయం సాధించింది.
పెనుగొండ నగర పంచాయతీ ఎన్నికలలో వైసిపికి చెందిన 9వ వార్డు అభ్యర్థి 437 ఓట్లు, 10వ వార్డు అభ్యర్థి 358 ఓట్లు, 11వ వార్డు అభ్యర్థి 44 ఓట్లు, 12వ వార్డు అభ్యర్థి 186 ఓట్లు 5వ వార్డు అభ్యర్థి 374 ఓట్లు, 6వ వార్డు అభ్యర్థి 288 ఓట్లు, 7వ వార్డు అభ్యర్థి 301 ఓట్లు, 8వ వార్డు అభ్యర్థి 259 ఓట్లు, 2వ వార్డు 472 ఓట్లు, 4వ వార్డు 192 ఓట్లు, టిడిపికి చెందిన 1వ వార్డు అభ్యర్థి 152 ఓట్లు, 3వ వార్డు అభ్యర్థి 175 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.