Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అబ్బెబ్బె.. నేను రాజీనామా చేయలేదు.. అంతా ఉత్తుత్తిదే : వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

vasantha krishna prasad
, మంగళవారం, 12 డిశెంబరు 2023 (08:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే యేడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఏపీలోని అధికార వైకాపాకు ఓటమి తప్పదనే సంకేతాలు ఇప్పటినుంచే వెలువడుతున్నాయి. దీంతో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు... కీలక నేతలు ఒక్కొక్కరు ఇప్పటి నుంచి పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. సోమవారం ఆ పార్టీ కీలక నేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు, గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల కృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవితో పాటు వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. 
 
అలాగే, మరో సీనియర్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా రాజీనామా చేసినట్టు జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను రాజీనామా చేయలేదని, అదంతా ఉత్తుత్తి ప్రచారమేనంటూ వివరణ ఇచ్చారు. తనపై విపక్ష నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ ప్రచారంలో అస్సలు నిజం లేదని, ప్రచారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తనకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాన్ని వైకాపా శ్రేణులు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
ప్రతి అంశాన్ని రాజకీయం చేయడమే ప్రతిపక్ష నేత అని అని ఆయన మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు చేస్తూ తనపై తప్పుడు ప్రచారం చేయడమే అజెండాగా పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం లేకపోవడంతో ప్రతిపక్ష నేత మతిస్థిమితం కోల్పోయారని, ప్రతిచోట ఉన్మాదంతో ఊగిపోతున్నారంటూ ఫైర్ అయ్యారు. మైలవరం నియోజకవర్గంలో 20 వేల మందికిపైగా ఇళ్ల పట్టాలు ఇచ్చానని, మిగిలిన కొన్ని గ్రామాల్లో కూడా ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు తీసుకుంటామని కృష్ణప్రసాద్ తెలిపారు. 
 
కాగా, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారంటూ సోషల్ మీడియా వేదికగా సోమవారం విస్తృతంగా ప్రచారం జరిగింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా నేపథ్యంలోనే ఈ ప్రచారం జరగడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖాళీగా ఉన్న మూవింగ్ ట్రైన్‌లో మహిళపై అత్యాచారం...