Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30 ఏళ్ళ పాటు సీఎంగా ఉండాలి... అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర... జగన్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులా తాను కూడా అసత్యాలు పలికి వుంటే తాను కూడా ముఖ్యమంత్రిని అయ్యేవాడినని వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తనకు ముఖ్యమంత్రి కావాలని, 30 ఏళ్లు సీఎంగా ఉండాలనే కోరిక ఉందని గుంట

Advertiesment
30 ఏళ్ళ పాటు సీఎంగా ఉండాలి...  అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర... జగన్
, ఆదివారం, 9 జులై 2017 (16:46 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులా తాను కూడా అసత్యాలు పలికి వుంటే తాను కూడా ముఖ్యమంత్రిని అయ్యేవాడినని వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తనకు ముఖ్యమంత్రి కావాలని, 30 ఏళ్లు సీఎంగా ఉండాలనే కోరిక ఉందని గుంటూరులో జరుగుతున్న పార్టీ ప్లీనరీలో మనసులోని మాటను బయటపెట్టారు.
 
జగన్ ఇంకా మాట్లాడుతూ.. 2014లో చంద్రబాబులాగా తాను అబద్ధాలాడి ఉంటే, ముఖ్యమంత్రిని అయ్యేవాడినేమోనని అన్నారు. అయితే, భవిష్యత్ తమదేనని, అధికారంలోకి రావడం ఖాయమని, అంతిమంగా న్యాయమే గెలుస్తుందని చెప్పారు. అధికారంలోకి వచ్చాక రైతులకు న్యాయం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. 
 
చంద్రబాబు పాలనలో కరవు, అకాల వర్షాలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. అక్టోబర్ 27 నుంచి తన పాదయాత్ర ప్రారంభిస్తున్నానని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 
 
దాదాపుగా 6 నెలల పాటు, 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తానని చెప్పారు. ప్రతి జిల్లాకు వస్తానని, ప్రతి ప్రాంతానికీ తిరుగుతానని, ప్రజలతోనే ఉంటూ పాదయాత్ర చేస్తానని.. ఇడుపులపాయ నుంచి తన పాదయాత్ర మొదలుపెట్టి తిరుమలకు వెళతానని, మెట్లెక్కి కొండపైకి వెళ్లి దేవుడిని దర్శించుకుంటానని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డోక్లాం నుంచి కదిలేది లేదన్న భారత్ సైన్యం..