Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజాపై బాబుకు ఎందుకింత కక్ష-కేంద్రానికంటే రాష్ట్ర జీడీపీ ఎక్కువా?: వైవీ ప్రశ్న

వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఇదివరకే ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేసిన సంగతి తెలిసందే. కాల్ మనీ విషయంలో అసెంబ్లీలో రోజా వ్యవహరించిన తీరుపై ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేశారు.

Advertiesment
రోజాపై బాబుకు ఎందుకింత కక్ష-కేంద్రానికంటే రాష్ట్ర జీడీపీ ఎక్కువా?: వైవీ ప్రశ్న
, శుక్రవారం, 17 మార్చి 2017 (16:02 IST)
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఇదివరకే ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేసిన సంగతి తెలిసందే. కాల్ మనీ విషయంలో అసెంబ్లీలో రోజా వ్యవహరించిన తీరుపై ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. అయితే తాజాగా అసెంబ్లీలో రోజా తోటి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, దురుసుగా ప్రవర్తించారంటూ ఆమెపై మరోసారి సస్పెన్షన్‌కు ప్రివిలేజ్ కమిటీ సిద్ధమవడం చర్చనీయాంశంగా మారింది. 
 
టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఏర్పాటైన ప్రివిలేజ్ కమిటీ మార్చి 4న సమావేశమై రూపొందించిన నివేదికను గురువారం శాసనసభకు అందజేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా పట్ల అధికార టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు. రోజాపై చంద్రబాబుకు ఎందుకింత కక్ష అంటూ ప్రశ్నించారు. 
 
ఇప్పటికే రోజాను ఏడాది పాటు అసెంబ్లీకి దూరం చేసిన ప్రభుత్వం మరోసారి కుట్రకు తెరలేపుతుందని మండిపడ్డారు. రోజా సస్పెన్షన్ పై న్యాయపోరాటం చేస్తామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు పాలనను ఆయన దుయ్యబట్టారు. కేంద్ర జీడీపీ కంటే రాష్ట్ర జీడీపీ ఎక్కువగా ఉందని చంద్రబాబు చెప్పడం ఆయన దిగుజారుడుతనానికి నిదర్శనమని అన్నారు.
 
ఓవైపు 2018నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతోన్న సీఎం.. ప్రాజెక్టు పూర్తవడానికి రూ.2800కోట్లు అవసరమని చెబుతూనే బడ్జెట్‌లో రూ.200కోట్లే కేటాయించడమేంటని ప్రశ్నించారు. బడ్జెట్ సాక్షిగా చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని సమాధి చేసేశారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీనివాస్‌కు అరుదైన గౌరవం: మార్చి 16.. ఇండియన్ అమెరికన్ అప్రిసియేషన్ డే..