తనను తిట్టేందుకు సినీ నటి శ్రీరెడ్డిని వైకాపా ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దించడంపై ఆ పార్టీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తనదైనశైలిలో సెటైర్లు వేశారు. ఆమె పేరతెత్తకుండానే శ్రీరెడ్డి తిట్ల దండకానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బిజ్జలా... ఆ ప్రముఖ నటి.. నీలిచిత్ర నటి.. రెడ్లలో కలుపు మొక్కలు ఉంటారు అంటూ వ్యాఖ్యానించారు.
ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ కార్యక్రమంలో రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, విగ్గురాజును మాట్లాడుతున్నానంటూ.. శ్రీరెడ్డి తనపై చేసిన కామెంట్‌ను ఆయన ప్రస్తావించారు.
'ఒక ప్రముఖ నటి.. శృంగార తార.. ఆమె దీక్షలు చేసినా.. గుడ్డలు విప్పి దీక్షలు చేస్తారు. దీక్షల్లో అదో వెరైటీ. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ గురించి కూడా ఆ వీరనారి నీచంగా మాట్లాడారు. కరోనా వచ్చినప్పడు కూడా మహానటి అతినీచంగా స్పందించారు.
బిజ్జల ఇచ్చిన పిలుపు మేరకు నిన్న నా మీద ఓ వీడియో రిలీజ్ చేసి పెట్టారు. నన్ను తిట్టడానికి వైసీపీలో రెడ్లు తప్ప ఇంకెవరూ లేరా... మిగిలిన వారితో తిట్టించరా సజ్జలా.. మీరొక్కరే తిడితే బాలేదురా... వెయ్యి మందిలో 999 మంది రెడ్లే ఉంటున్నారు. పార్టీ మంచి కోసం చెబుతున్నాను.
మీరు పిచ్చిగా అభిమానించే అతనికే మంచిది కాదు. నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇలాగే చెలరేగి వాగితే నా వెంట్రుక కూడా పీకలేరు. మీకు అర్థమయ్యే భాషలో చెబుతున్నాను. వెర్రి వెధవలారా! ఆ ప్రముఖ నటీమణి.. నీలిచిత్ర నటి' అంటూ రెడ్లలో కలుపు మొక్కలు ఉంటారని వ్యాఖ్యానించారు.